Russia Ukraine war Effect : రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరల పెరుగుదల - Russia Ukraine war Effect on other countries
Russia Ukraine war Effect : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాకు కలిగే నష్టం తక్కువేనని.. కానీ ప్రపంచ దేశాలపై ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పాపారావు అన్నారు. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు భారీగా పెరుగుతాయని తెలిపారు. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగానే ఉంటుందని.. ఇప్పటికే కరోనా సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న మన దేశానికి ఈ యుద్ధం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లేనని చెప్పారు.
Russia Ukraine war Effect : ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యాకు కలిగే నష్టం తక్కువేనని.. ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్‌తో పాటు ఇతర దిగుమతి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పాపా రావు తెలిపారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాల నుంచి లభించే మద్దతు అంతంత మాత్రమేనని.. యుద్ధ నష్టాన్ని భరించే స్థితిలో నాటో దేశాలు లేవని అన్నారు. వైమానిక స్థావరాలు, సైనిక బేస్‌ను కోల్పోయిన ఉక్రెయిన్.. రష్యా దాడిని తట్టుకునే శక్తిని పూర్తిగా కోల్పోయిందని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల కలిగే అనర్థాలపై పాపా రావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యేక ముఖాముఖి..
- ఇదీ చదవండి :ఉక్రెయిన్, రష్యా యుద్ధం- ఎవరి బలం ఎంత?