తెలంగాణ

telangana

ETV Bharat / city

High Court of AP: అమరావతిలో.. హైకోర్టు భవనం విస్తరణ!

ప్రస్తుతం ఉన్న ఏపీ హైకోర్టు పక్కనే మరో భవనాన్ని నిర్మించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. న్యాయస్థానం సూచన మేరకు సర్కారు ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణాన్ని రూ.29.40 కోట్ల అంచనా వ్యయంతో ఆరు నెల్లలోగా పూర్తి చేయాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిటీ కోర్టు కాంప్లెక్సుగా నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.

expansion-of-high-court-building-in-amravati
అమరావతిలో.. హైకోర్టు భవనం విస్తరణ!

By

Published : Aug 18, 2021, 1:54 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే మరో భవనాన్ని ప్రభుత్వం నిర్మించబోతుంది. హైకోర్టు భవనంలో స్థలం సరిపోకపోవటంతో న్యాయస్థానం సూచన మేరుకు ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి ఏఎంఆర్​డీ టెండర్లు పిలిచింది. రూ.29.40 కోట్లు అంచనా వ్యయంతో ఆరు నెలల్లో పూర్తి చేయాలని టెండర్ నోటీసులో పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జీ+5 భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. ప్రస్తుతానికి జీ+3 మాత్రమే నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మిత ప్రాంతం 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 60 కార్లకు పార్కింగ్ వసతి కల్పించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిటీ కోర్టు కాంప్లెక్సుగా నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.

ఇదీ చూడండి:'గాంధీ'లో డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ.. ఇప్పటికే అంతర్గత కమిటీ నివేదిక!

ABOUT THE AUTHOR

...view details