ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్య ఘటనలో.. బాధిత బంధువులకు ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందింది. అబ్దుల్ సలాం అత్తయ్య మాబున్నిసాకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి రూ. 25లక్షల చెక్కును అందజేశారు. తొలుత చెక్కును చేసుకునేందుకు ఆమె నిరాకరించారు. డబ్బు వద్దు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్, అధికారులు ఆమెను ఓదార్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె చెక్కును తీసుకున్నారు.
సలాం కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థికసాయం - అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వ సాయం
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్య ఘటనలో... బాధిత బంధువులకు ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందింది. అబ్దుల్ సలాం అత్తయ్యకు కలెక్టర్ వీరపాండియన్, అధికారులు చెక్కును అందించారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సలాం కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థికసాయం