ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల కోసం పూర్తి స్థాయిలో చర్చిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అర్థవంతమైన చర్చ జరిగేలా వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన చెప్పారు.
ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలు చర్చిస్తాం: ప్రశాంత్ రెడ్డి - వేముల ప్రశాంత్ రెడ్డి వార్తలు
అర్థవంతమైన చర్చ జరిగేలా వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలు చర్చిస్తామని పేర్కొన్నారు. కరోనా నిబంధనల మేరకే మీడియా పాయింట్ తొలగిస్తున్నామని వెల్లడించారు.
vemula prasanth reddy
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో మంత్రి తెలిపారు.
Last Updated : Sep 5, 2020, 2:52 PM IST