తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్‌లో మరికొంతకాలం సిటీ బస్సులకు అనుమతిలేదు - cm kcr review on tsrtc

cm kcr
cm kcr

By

Published : May 27, 2020, 7:55 PM IST

Updated : May 27, 2020, 9:55 PM IST

19:53 May 27

హైదరాబాద్‌లో మరికొంతకాలం సిటీ బస్సులకు అనుమతిలేదు

ఆర్టీసీ బస్సులకు బుధవారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్​తో పాటు, ఎంజీబీఎస్​లో కూడా ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రగతి భవన్​లో ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.  

ఆదాయం తగ్గింది

రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత పరిస్థితిని సీఎం కేసీఆర్​కు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఇటీవల జరిగిన పరిణామాల వల్ల ఆర్టీసీ బాగా నష్టపోయిందని తెలిపారు. సమస్య కొలిక్కి వచ్చి గాడిన పడుతున్న తరుణంలో కరోనా వచ్చిందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదని వివరించారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం రావడం లేదని వెల్లడించారు. రోజుకు 11 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావాలని... ఇప్పుడు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వస్తుందని అధికారులు తెలిపారు.  

అంతర్రాష్ట్ర బస్సులు నడవవు

ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయని... కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టరని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపరని సీఎం స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడపరని పేర్కొన్నారు.

Last Updated : May 27, 2020, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details