ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆయన సతీమణి.. అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగులవాయిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిరువురూ ద్విచక్రవాహనంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుటుంబసభ్యులూ ఇక్కడే ఓటువేశారు.
ద్విచక్ర వాహనంపై పోలింగ్‌కు వెళ్లిన రఘువీరా దంపతులు - గుంగులవాయిపాలెంలో ఓటేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా దంపతులు
ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగులవాయిపాలెంలో.. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఆయన సతీమణి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుటుంబ సభ్యులూ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![ద్విచక్ర వాహనంపై పోలింగ్‌కు వెళ్లిన రఘువీరా దంపతులు ద్విచక్ర వాహనంపై పోలింగ్‌కు వెళ్లిన రఘువీరా దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10722616-956-10722616-1613928139846.jpg)
ద్విచక్ర వాహనంపై పోలింగ్‌కు వెళ్లిన రఘువీరా దంపతులు
చందకచర్లలో నవ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవిందపురం పరిధిలోని పలు వార్డులకు పోలింగ్ కోసం పాఠశాల గదుల కొరత ఉండటంతో.. ఆరుబయట షామియానా వేసి ఓటింగ్ నిర్వహించారు. వర్షం కారణంగా కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి