దుబ్బాక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో దొరికిన డబ్బులు తనవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దొరికిన డబ్బులు ఎవరివో దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని... దీంతో సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌పై పరువునష్టం దావా: వివేక్
ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌పై వంద కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. దుబ్బాక ఎన్నికల సందర్బంగా హైదరాబాద్‌లో దొరికిన డబ్బులు తనవని ధ్రువీకరించడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు.
సీఎం కేసీఆర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌పై పరువునష్టం దావా: వివేక్
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్టు తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే... వంద కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్టు వెల్లడించారు.