ఇటీవల కురిసిన వర్షాలకు రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్ఖాన్ చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా చెరువుకు సమీపంలో ఉన్న ఉస్మాన్నగర్లోని ఇళ్లన్నీ ముంపునకు గురయ్యాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షాకిర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
వరద నీటిలో మగ్గిపోతున్న తమను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. వరద బాధితులకు ప్రభుత్వం అందించే రూ.10 వేల సాయం కూడా సక్రమంగా అందడం లేదన్నారు.