Konda Vishweshwar Reddy Join in BJP: ఎట్టకేలకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తోన్న భాజపా విజయ సంకల్ప సభ వేదికగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కాషాయ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. సభా వేదికగా.. భాజపాలోని మహామహులు, ప్రముఖ నేతల సమక్షంలో.. లక్షల కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొండా విశ్వేశ్వరరెడ్డికి గ్రాండ్ వెల్కం దక్కింది.
కాషాయ తీర్థం పుచ్చుకున్న కొండా.. మహామహుల సమక్షంలో గ్రాండ్ ఎంట్రీ.. - కాషాయ తీర్థం పుచ్చుకున్న కొండా
Konda Vishweshwar Reddy Join in BJP: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కమలనాథులతో అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా విజయ సంకల్ప సభ వేదికగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం గూటికి చేరారు.

Ex MP Konda Vishweshwar Reddy Join in BJP in Vijaya Sankalpa Sabha at Pared Grounds
జూన్ 29న భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించగా.. సుముఖత వ్యక్తం చేశారు. 30న భాజపాలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే.. జులై 1 నుంచి ఇవాళ, రేపు అనుకుంటూ వచ్చిన చేరికకు ముహూర్తం ఈరోజు కుదిరింది.
ఇవీ చూడండి: