తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​ గూటికి చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి - dubbaka bypoll news

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు.. శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్​ గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చేరికను స్వాగతిస్తున్నామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​. రేపటి నుంచి నవంబర్‌ 1 వరకు దుబ్బాకలో అందుబాటులో ఉంటానని ఉత్తమ్‌ వెల్లడించారు.

cheruku srinivas reddy
కాంగ్రెస్​ గూటికి చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి

By

Published : Oct 6, 2020, 5:54 PM IST

మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణలో ఆదర్శ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని ఉత్తమ్‌ కొనియాడారు.

కాంగ్రెస్​ గూటికి చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారాయని ఉత్తమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దోచుకున్న సొమ్ముతోనే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు, మద్యం ఎవరు పంపిణీ చేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి సహకరించాలని కార్యకర్తలను కోరుతున్నానన్నారు.

నిబంధనల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని ఉత్తమ్‌ ఆకాంక్షించారు. ఎన్నికలను ప్రభావితం చేస్తే సహించమని స్పష్టం చేశారు. బుధవారం నుంచి నవంబర్‌ 1 వరకు దుబ్బాకలో ఉంటామని ఉత్తమ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి సమర్థ నాయకత్వం ఉందని స్పష్టం చేశారు.

ఇవీచూడండి:తెరాస అభివృద్ధిని ఆదరించి ఆశీర్వదించండి: హరీశ్​

ABOUT THE AUTHOR

...view details