మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ హైదరాబాద్ లోని అనిశా కోర్టుకు హాజరయ్యారు. మోపిదేవి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మద్యం వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్లు అనిశా అధికారులు అభియోగం మోపారు.
మద్యం కుంభకోణంలో అనిశా కోర్టుకు హాజరైన ఎంపీ - ఎంపీ మోపిదేవి తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ... ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో అనిశా అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన హైదరాబాద్ అనిశా న్యాయస్థానానికి ఇవాళ హాజరయ్యారు.

మద్యం కుంభకోణంలో అనిశా కోర్టుకు హాజరైన ఎంపీ
ఈ కేసులో ఇతర నిందితులపై కూడా అనిశా అభియోగాలు నమోదు చేసింది. షెడ్యూలు ఖరారు చేసిన ఏసీబీ న్యాయస్థానం.. ఈనెల 19 నుంచి విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి :హైదరాబాద్లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం