తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల భేటీ - తెలంగాణ తాజా వార్తలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల భేటీ
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల భేటీ

By

Published : May 11, 2021, 3:13 PM IST

Updated : May 11, 2021, 8:45 PM IST

15:10 May 11

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల భేటీ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి సుమారు గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. 

ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.

ఇవీచూడండి:'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'

Last Updated : May 11, 2021, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details