YSRCP MLA Sucharitha: వైకాపాను వీడతానంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతనంగా నిర్మించిన పంచాయతీ దుకాణాల భవనాలు, సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.
నేను ప్రతిసారీ వాటిపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదు. నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని చెప్పానో ఆ మాటమీదే నిలబడతాను. సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో నాకు సంబంధం లేదు. ఎవరో ఏదో అన్నారని సమాధానం చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలు మానేస్తే నా ఇంట్లో గృహిణిగానే ఉంటాను. - మేకతోటి సుచరిత, ఏపీ మాజీ హోంమంత్రి