Savang on Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. తనకు ఎప్పుడూ చెప్పేవారని ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ కొన్ని వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని.. అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Savang on Viveka Murder Case: 'వివేకా హత్య కేసు విచారణలో జగన్ జోక్యం లేదు' - మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
Savang on Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే వివేకా హత్య కేసు విచారణ విషయమై ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Savang on Viveka Murder Case: 'వివేకా హత్య కేసు విచారణలో జగన్ జోక్యం లేదు'
వైఎస్ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సీఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్ తెలిపారు.
సంబంధిత కథనాలు: