Army helicopter crash: "ఈరోజు జరిగిన ఘటన దౌర్భగ్యకరం. దేశం మొత్తానికి షాకింగ్ రోజు. ఈరోజు జరిగిన ఘటనను నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ధరించేది కాదు. పూర్తి వివరాలు లేకుండా ఏదో ఓ నిర్ణయానికి రాలేము. కానీ.. ఫొటోలను బట్టి చూస్తే సాంకేతిక లోపం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు నాకనిపిస్తోంది. అనుకూల పరిస్థితులు లేక.. అనుకోని పరిస్థితుల్లోనే.. దట్టమైన చెట్లు ఉన్న చోట ఫోర్స్‌ఫుల్ ల్యాండింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో క్రాష్ అయ్యాక జరిగిన అగ్నిప్రమాదంలోనే ఎక్కువ మంది దుర్మరణం చెంది ఉంటారని నా అభిప్రాయం. ప్రోటోకాల్ పరంగా ఎలాంటి లోపం ఉన్నట్టు నేననుకోను. జనరల్ బిపిన్ రావత్ ఉన్నతాధికారి కాదు.. అందరికంటే ఉన్నతమైన అధికారి. ఆయనకు తీసుకున్నన్ని భద్రతా చర్యలు ఇంకెవరికి తీసుకోరు. ఎమ్-17 వీ5 లో అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇందులో లేని సాంకేతికత లేదు. లోడ్ పరంగా గానీ.. పరిధి పరంగా గానీ... ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొత్త ప్రాంతం కావటం వల్ల.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఫోర్స్ ల్యాండింగ్ ఒక్కటే మార్గం..!
Army helicopter crash: 'ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపమే కారణం..!' - Army helicopter crash updates
Army helicopter crash: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు కూనూర్ వద్ద జరిగిన ప్రమాదం.. అక్కడి భౌగోళిక ప్రతికూల పరిస్థితులు, హెలికాప్టర్లో సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. త్రివిధ దళాధిపతిగా రక్షణ వ్యవస్థల ఇంటిగ్రేషన్ కొరకు బిపిన్ రావత్ అలుపెరుగని సేవలు చేశారని.. సీడీఎస్ చీఫ్‌గా ఆయన లేని లోటు భారత రక్షణ వ్యవస్థకు అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. ప్రమాద తీరు, జనరల్ బిపిన్ రావత్ సేవలపై ఈటీవీ భారత్‌తో రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి ముఖాముఖి..
![Army helicopter crash: 'ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపమే కారణం..!' ex army officer bharath singireddy interview general Bipin Rawat helicopter crash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13851068-965-13851068-1638983317220.jpg)
ఈ ప్రమాదానికి రెండే రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒక్కసారిగా తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపం.. లేదా ప్రతికూల వాతవరణ పరిస్థితులు. ఇప్పుడు వచ్చిన ఫొటోలను బట్టి చూస్తుంటే.. పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి కన్పిస్తున్నాయి. హెలికాప్టర్ బలంగా వచ్చి పడినట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఒక్కసారిగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తినట్టు చూడొచ్చు. ఇలాంటి సందర్భంలో.. పైలెట్‌కు ఫోర్స్ ల్యాండింగ్ ఒక్కటే మార్గం. దాని కోసం ఏదైన అనుకూల ప్రదేశం దొరకని సమయంలో.. లేదా.. పైలెట్ ఆలోచించుకునేంత సమయంలేని తీవ్ర సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఫోర్స్‌ఫుల్ ల్యాండింగ్ తప్పనిసరి. దాని వల్ల క్రాష్ అయ్యి.. అగ్నిప్రమాదం జరగటం వల్లే మనకు ఎక్కువ నష్టం జరిగినట్టు అనిపిస్తోంది." - రిటైర్డ్ మేజర్ భరత్ సింగిరెడ్డి
సంబంధిత కథనాలు..