1. దేశవ్యాప్తంగా ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బంగాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి సీపీఐ(ఎంఎల్), సీపీఎం, కాంగ్రెస్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాదవ్పుర్లోని రైల్వే ట్రాక్‌ను నిర్బంధించారు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్తంభించిన రవాణా
దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసనకు రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ తరుణంలో ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తగా రవాణా సేవలను నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దేశవ్యాప్తంగా 44,489 కేసులు
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 44,489 మందికి కొవిడ్ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 92లక్షల 66వేల 706కు చేరింది. వైరస్ కారణంగా మరో 524 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాష్ట్రంలో 862 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,904 కరోనా కేసులు నమోదు కాగా 1,444 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గౌరవం కాపాడాలి : బండి సంజయ్
పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. లైవ్ వీడియో: కమ్మేసిన మృత్యువు
మృత్యువు ఎప్పుడు ఆవహిస్తుందో తెలియదనడానికి ఇదొక నిదర్శనం. రోడ్డుపై ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా.. పక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలి అతడిపై పడింది. నివర్ తుపాను ప్రభావంతో భారీ వృక్షం ఒక్కసారిగా మీద పడటం వల్ల అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'బాల్యంలోనే ఎయిడ్స్ ముప్పు'
ప్రపంచాన్ని ఓ వైపు కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు హెచ్ఐవీ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్ఐవీ సోకుతుందని యూనిసెఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 43,890 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'వికెట్ కీపింగ్ చేస్తా'
రాబోయే మూడు ఐసీసీ ప్రపంచకప్పుల్లో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇదే కాకుండా జట్టు తన నుంచి ఏది ఆశించినా చేయడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రెమ్యునరేషన్‌తో రెస్టారెంట్
ఇటీవలే 'మిడిల్‌క్లాస్ మెలొడీస్' చిత్రంతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఖాజాగూడలో 'గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్' రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.