తెలంగాణ

telangana

ETV Bharat / city

మోదీ 'విజయ సంకల్ప సభ'కు సర్వం సిద్ధం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమయ్యింది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం....అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరయ్యే బహిరంగ సభకు పది లక్షల మందిని తరలించేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేశారు.

BJP
BJP

By

Published : Jul 3, 2022, 5:11 AM IST

Updated : Jul 3, 2022, 7:12 AM IST

హైదరాబాద్‌లో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పది లక్షల మందితో భారీ ఎత్తున నిర్వహించబోయే సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహిరంగ సభాస్థలి వద్ద మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 మందికి ఒక వేదిక, రాష్ట్ర, జాతీయ స్థాయి పదాధికారులకు మరో వేదికను సిద్ధం చేశారు. ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాన వేదికపై ప్రధాని మోదీ సహా కేవలం ఎనిమిది మందికే కూర్చునే అవకాశం దక్కనుంది. ఇందులో మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. వీరితో పాటు ఎనిమిదో వ్యక్తిగా జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. భాజపా పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల కోసం సభలో ప్రత్యేక డయాస్ ఏర్పాటు చేస్తున్నారు. అగ్రనేతలంతా ఒకే వేదికపై నుంచి తెరాస పాలనే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.

విజయ సంకల్ప సభను విజయవంతం చేసేందుకు కాషాయదళం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జన సమీకరణ చేస్తున్నారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు 18 ట్రైన్స్‌తో పాటు వందలాది ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత బహిరంగ సభకు హాజరయ్యేందుకు సాయంత్రం 5 గంటల 55నిమిషాలకు హెచ్​ఐసీసీ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. బేగంపేట విమానాశ్రయానికి 6 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి 6 గంటల 20 నిమిషాలకు బయల్దేరి సభాస్థలికి 6 గంటల 30 నిమిషాలకు వస్తారు. ఏడు గంటల 30 నిమిషాల వరకు సుమారు గంటపాటు ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. విజయసంకల్ప సభలో ప్రధాని సహా అగ్రనేతల ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Last Updated : Jul 3, 2022, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details