తెలంగాణ

telangana

ETV Bharat / city

భారత్‌-ఆసీస్ మ్యాచ్​కు సర్వం సిద్ధం.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు - భారత్ ఆసీస్ మ్యాచ్ అప్డేట్

India vs Australia T20 Match News: భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్‌ నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ పూర్తి చేసింది. భారత్‌ - ఆసిస్‌ జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుని తాజ్‌ కృష్ణ, పార్క్‌ హాయత్‌ హోటల్‌లో బస చేశాయి. క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఆటను తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

everything
భారత్‌-ఆసీస్ మ్యాచ్​కు సర్వం సిద్ధం.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు

By

Published : Sep 25, 2022, 12:12 AM IST

India vs Australia T20 Match News: ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నేడు భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరగనుంది. మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా తొలి టీ20లో ఆసిస్‌, రెండో టీ20లో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మ్యాచ్‌ కోసం ఉప్పల్‌ స్టేడియం వేదికైంది. ఈ ఉత్కంఠ పోరును తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రాత్రి 7గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

300 సీసీ కెమెరాలతో నిఘా.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 2వేల 5వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 3వందల సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమోరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కదలికలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేడియం వద్ద ఫైర్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అందించనున్నారు. ఏడు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. అవాంచనీయ సంఘటనలు, ప్రమాదాలు సంభవిస్తే అంబులెన్స్‌ల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.

సిరీస్ కైవసం చేసుకునేదేవరో.. ఈ రోజు ఉదయం 7గంటలకు భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు ఉప్పల్‌ స్టేడియంకు చేరుకుని సాధన చేయనున్నాయి. సాధన ముగించుకున్న అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్లి ఇరు జట్లు విశాంత్రి తీసుకుంటాయి. రాత్రి 7గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌ కోసం సాయంత్రం 5గంటలకు ప్రత్యేక బస్సుల్లో ఇరు జట్లు స్టేడియానికి చేరుకుంటాయి. సిరీస్‌ను కైవసం చేసుకునే మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చరవాణికి అనుమతి.. మూడేళ్ల తరువాత నగరంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో పాటు అదివారం కూడా కావడంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 4గంటల తరువాత టికెట్‌ కొనుగోలు చేసిన క్రికెట్‌ అభిమానులను క్షుణ్నంగా తనిఖీ చేసి స్టేడియం లోపలికి అనుమతిస్తారు. స్టేడియంలోనికి చరవాణికి అనుమతి ఉందన్న పోలీసులు ల్యాప్‌ టాప్‌, వీడియో కెమెరాలు, హెల్మెట్‌, వాటర్ బాటిల్స్‌, మద్యం సీసాలు, మాదకద్రవ్యాలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details