1. వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలు, వరదలపై ప్రగతిభవన్‌లో సమీక్షించేందుకు... సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం తీసుకుంటున్న, భవిష్యత్‌తో చేపట్టాల్సిన చర్యల, పునరావాస చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లైవ్ వీడియో: తిరగబడ్డ బోటు.. రక్షించిన సహాయక సిబ్బంది
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో టోలీచౌకీ విరాసత్నగర్లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను తరలిస్తుండగా.. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఊహించని పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముంపు ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమై... ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బ్యాంకు నిధులు కాజేసిన కేసులో మేనేజరుకు జైలు శిక్ష
మెదక్ జిల్లా ఆంధ్రా బ్యాంకు భానూర్ బ్రాంచ్ మాజీ మేనేజరుకి సీబీఐ కోర్టు శిక్ష విధించింది. బ్యాంకు నిధులు కాజేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మేనేజరు డి.నరసింహారెడ్డికి మూడేళ్ల పాటు జైలు శిక్ష, రూ. లక్షన్నర జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కవి దిగ్గజం అచ్యుతన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ కవి అక్కితం అచ్యుతన్ నంబూదిరి త్రిశూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 94ఏళ్ల ఆయన మలయాళ సాహితీ లోకానికి ఎనలేని సేవలందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.