Rain effect in srikakulam: గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బస్‌స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. బస్టాండ్ లోతట్టున ఉండడం వల్ల వర్షం పడిన ప్రతిసారీ ఇలా వర్షపునీటితో మునిగిపోతుందని స్థానికులు తెలుపుతున్నారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిలోనే బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఏళ్ల తరబడి బస్టాండ్ దుస్థితిని పట్టించుకోనే నాదుడే లేడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం కాస్త ఈ పరిస్థితికి పరిష్కారం కనుక్కోవాలని స్థానికులు తెలిపారు. ప్రభుత్వాలు మారిన ఈ బస్టాండ్ దుస్థితి మాత్రం మారడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
భారీ వర్షాలకు నీట మునిగిన శ్రీకాకుళం బస్‌స్టేషన్.. ప్రయాణికుల అవస్థలు.. - Rain Forecast for AP
Rain effect in srikakulam: శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరివాహ ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీకాకుళంలో వరద
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరివాహ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక, సముద్ర తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండమని అధికారులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: