1. భారతీయ అమెరికన్ల హవా
అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు మరోసారి తమ హవా కొనసాగించారు. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. నలుగురు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సుప్రీంకు వెళ్తాం
అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకు ఇప్పటికే గెలిచామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పుంజుకున్న ట్రంప్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. అనేక పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించిన ఆయన.. ఎలక్టోరల్ ఓట్లలో మొదటి నుంచి ముందంజలో ఉన్న బైడెన్‌ను ఓ దశలో దాటేశారు. లెక్కింపు కొనసాగుతోన్న మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. ఇలాగే కొనసాగితే గెలుపు తథ్యమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సొమ్ము చెలిస్తాం
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం... తెలంగాణ హైకోర్టును మరోసారి కోరింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసులపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం న్యాయస్థానాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గెలుపుపై పార్టీల ధీమా
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటరు చైతన్యం ప్రస్పుటమైంది. సుమారు 83 శాతం పోలింగ్ నమోదైంది. ఓటెత్తిన దుబ్బాక తమకే లాభిస్తుందని ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఎవరికి వారు తాము ఇంత మోజార్టీతో గెలుస్తాం.. అంత మోజార్టీతో గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.