తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM

By

Published : Nov 3, 2020, 7:02 PM IST

1. ఈవీఎంలో భవితవ్యం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ భారతి హొళికెరితో పాటు ఉన్నతాధికారులు... ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీపీ జోయెల్ డేవిస్ శాంతి భద్రతలు పర్యవేక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బల్దియా సమరానికి వేళాయే!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 13న ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఇదే స్ఫూర్తితో పనిచేయాలి

ఖమ్మం జిల్లాలో డీఆర్​ఎఫ్​ బృందాలు చేపట్టిన సహాయక చర్యలను ఖమ్మం మున్సిపల్ కమిషనర్​ ట్వీట్​ చేశారు. దానిని మంత్రి కేటీఆర్​ రీట్వీట్​ చేశారు. ఖమ్మం మున్సిపల్​ కమిషనర్​కు అభినందనలు తెలిపారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. గెలుపు మాదే

ప్రతిపక్షం బాగుంటేనే... ప్రజాస్వామ్యం బాగుంటుందనే నినాదం.. దుబ్బాక నియోజకవర్గంలో రుజువు అవుతోందని భాజపా అభ్యర్థి రఘునందన్​ రావు తెలిపారు. అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రెండోదఫా పోలింగ్​ ప్రశాంతం

94స్థానాలకు జరిగిన బిహార్​ రెండో దఫా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్​ సాగింది. నితీశ్​ కుమార్​, తేజస్వీ యాదవ్​ వంటి ప్రముఖులు ఈ దఫా పోలింగ్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సీఎంకు చేదు అనుభవం

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. మూడోదఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హర్లఖి మధుబానిలో ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో నితీశ్​పై కొందరు దుండగులు ఉల్లిపాయలు, రాళ్లను విసిరారు. నితీశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనలో నితీశ్​కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది నితీశ్​కు భద్రత కల్పించారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని నితీశ్​ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మృత్యుంజయుడు

టర్కీలో భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారి నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడింది. దాదాపు 90 గంటలు శ్రమించి రెస్క్యూ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

పసిడి, వెండి ధరలు మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.50కి పైగా పెరిగింది. వెండి ధర కిలోకు రూ.61,800కు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మహిళా టీ20 షెడ్యూల్​

మహిళా టీ20 ఛాలెంజ్ టోర్నీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. హర్మన్​ప్రీత్​ కౌర్ నేతృత్వంలోని సూపర్​ నోవాస్​, స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్​ బ్లేజర్స్​, మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్​పై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. దీపిక మేనేజర్​కు ఊరట

సుశాంత్​ మృతికి సంబంధించిన డ్రగ్స్​ కేసులో నటి దీపిక పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ అభియోగాలు ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆమె నివాసంలో మాదకద్రవ్యాలు పట్టుబడిన క్రమంలో ముందస్తు బెయిల్​ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా.. అందులో తాత్కాలిక ఊరట లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details