1. రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం
మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే సిబ్బంది మంటలను అర్పుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 55.52 శాతం పోలింగ్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విద్యార్థులకు శుభవార్త
కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలనే నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. భద్రత ఎలా కల్పిస్తారు?
ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ చేసింది. ఆస్తుల వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం... ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వొద్దని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దిల్లీలో చలి జోరు
దిల్లీలో ఉష్ణోగ్రత ఈ సీజన్లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మంగళవారం 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. హిమాచల్‌లోని శీతల ప్రాంతాలతో పోలిస్తే రాజధానిలోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు దిల్లీలో వాయు నాణ్యత సూచీ మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయింది. ఈ నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.