1. స్మగ్లర్లు... సజీవదహనం
ఏపీలోని కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో ఎర్రచందనం తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రిజిస్ట్రేషన్లు షురూ
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 20 మండలాలు మినహా.. 570 తహసీల్దార్ కార్యాలయాలు ఇందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో 55 రోజుల తర్వాత... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గేరు పడేనా?
అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. సోమవారం సాయంత్రం నుంచి తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో పూర్తి స్పష్టత వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పరిష్కార ప్రక్రియకు శ్రీకారం
రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. భక్తులు కిఛోరా షరీఫ్ దర్గాను సందర్శించి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.