తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @9PM

By

Published : Sep 13, 2020, 8:59 PM IST

1. ఏళ్లపాటు గొప్పగా ఉండాలి

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణమైనందున.. ఎక్కడా తొందరపాటు లేకుండా, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ప్రశాంతంగా ముగిసిన నీట్

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ... దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష... సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. నిబంధనలను పాటిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 112 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ముచ్చటగా మూడోసారి

అంతర్​ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల చర్చలు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు... ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమైనా కొలిక్కి రాలేదు. ముచ్చటగా మూడోసారి ఈ నెల 15న సమావేశం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఏపీలో కేసులెన్నంటే?

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 9,536 కరోనా కేసులు నమోదుకాగా.. 66 మరణాలు సంభవించాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,67,123కి చేరింది. వైరస్ మహమ్మారితో ఇప్పటివరకు 4,912 మంది మృతి చెందారు. ప్రస్తుతం 95,072 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్ నుంచి 4,67,139 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. వచ్చే ఏడాదిలోనే వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్​ కోసం దేశప్రజలు ఎన్నో ఆశలతో వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్​ వ్యాక్సిన్​.. 2021లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ మీడియా సమావేశంలో వెల్లడించారాయన. టీకా భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6.అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న విపక్షాలు

సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై పార్లమెంట్​లో చర్చలు జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంట్​ వర్షాకాల సమావేశానికి ఒక రోజు ముందు వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం- మన్రేగాకు రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​(74) ఇకలేరు. కరోనా సోకి వారం రోజులుగా దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆర్​జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని 3 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. పరిస్ధితి విషమించగా.. వెంటిలేటర్​ అమర్చి చికిత్స కొనసాగిస్తున్న తరుణంలోనే తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఫ్రాన్స్​లో మళ్లీ నిరసనలు

ఫ్రాన్స్​లో ఎల్లో వెస్ట్ నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. ఇంధనంపై పన్ను పెంపునకు నిరసనగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆర్థిక న్యాయం అందించాలంటూ తిరిగి మొదలైంది. అయితే నిరసనల తీవ్రత తక్కువగానే ఉందని అక్కడి మీడియా పేర్కొంది. పారిస్​లో జరిగిన రెండు ర్యాలీల్లో వెయ్యి మంది పాల్గొన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఈ వయసులోనూ మాకు నచ్చింది చేస్తున్నాం

ఐపీఎల్​ కోసం ధోనీతో పాటు నెట్​ ప్రాక్టీసు చేస్తోన్న వీడియోను పోస్ట్​ చేశాడు సీఎస్కే ఆటగాడు షేన్​ వాట్సన్​. దీంతోపాటు జట్టుతో తనకున్న అనుంబంధాన్ని చెప్పుకొచ్చాడు. ఫ్రాంచైజీ జట్టును నడిపించే విధానం బాగుంటుందన్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. రకుల్​కు​ మద్దతుగా సమంత

మాదక ద్రవ్యాల కేసులో రకుల్​ ప్రీత్​ సింగ్ పేరు వినిపించడంపై స్పందించింది సమంత. ఆమెకు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ఇన్​స్టా స్టోరీస్​లో ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details