తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM

By

Published : Sep 10, 2020, 3:00 PM IST

1. ఎంపీలతో సీఎం‌ సమావేశం

ఈ నెల14 నుంచి పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. సభలో హీరోగిరి వద్దు

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసే సమయంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్​గోపాల్​రెడ్డికి మంత్రి కేటీఆర్​కు మధ్య కౌంటర్​, ఎన్​కౌంటర్​ జరిగింది. కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సభలో వాస్తవాలు మాట్లాడాలని మంత్రి రాజ్​గోపాల్​ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. విశ్వాసం పెంచాలి

కరోనా చికిత్సకై కార్పొరేట్​ ఆసుపత్రులు ఇష్టానుసారంగా బెడ్ ఛార్జ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై వారికి విశ్వాసం కల్పించడం ద్వారా ఈ ప్రైవేటు దోపిడీని నివారించవచ్చని ఆయన మండలి వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సొమ్ము చోరీ

నకిలీ చెక్​లతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు కాజేశారు దుండగులు. రెండు సార్లు భారీ మొత్తంలో నగదు ఉపసంహరించి..మూడోసారి ప్రయత్నించగా నకిలీ విషయం బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ట్రస్ట్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. రఫేల్ రాక..

ఐఏఎఫ్‌లోకి రఫేల్‌ విమానాల చేరికతో భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయిందని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్. జాతీయ భద్రతే భారత మొదటి ప్రాధాన్యమని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. భారత్​పై దాడికి డ్రాగన్‌ పన్నాగం

దురాక్రమణ పూరిత వైఖరితో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా.. భారత్​ను నిలువరించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటికే డ్రాగన్​కు చెమటలు పట్టిస్తున్న భారత్​ను కట్టడిచేసేందుకు.. పాక్​, నేపాల్​ను అస్త్రాలుగా వినియోగించుకోవాలని చూస్తోంది చైనా. సరిహద్దుల్లో చొరబాట్లు, ఒప్పందాల ఉల్లంఘన సహా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేలా ఈ దేశాలను ఉసిగొల్పుతోంది జిన్​పింగ్​ ప్రభుత్వం. అయితే భారత్​ మాత్రం ప్రత్యర్థుల నుంచి ఎలాంటి వ్యూహాలనైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


7. 750 మంది విద్యార్థులకు కరోనా

ప్రపంచంపై కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. అమెరికాలో ఆ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇటీవలే టెనిసీ రాష్ట్రంలో పాఠశాలలను పునఃప్రారంభించగా.. భారీగా కేసులు నమోదవుతున్నాయి. వందల మంది విద్యార్థులు, సిబ్బంది కరోనా బారినపడతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రుణ గ్రహీతలకు ఊరట

రుణాలపై మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం, ఆర్​బీఐ సమగ్ర వివరాలు రెండు వారాల్లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రుణగ్రహీత ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. రైనా స్థానం భర్తీ కష్టం

ఐపీఎల్​ నుంచి సురేశ్​ రైనా తప్పుకోవడం జట్టుకు తీరని లోటని అన్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్​ షేన్ వాట్సన్​. రైనా, హర్భజన్​ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. కంగనకు నోటీసులు?

బిల్డింగ్ విషయంలో గతంలోనూ కంగనకు నోటీసులు వచ్చాయనే వార్తలపై ఆమె స్పందించారు. అలాంటిదేమి లేదని, ఈ భవంతిని అన్ని అనుమతులు తీసుకునే కట్టించానని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details