1. సినిమా హాళ్లకు నో
కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్రం హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మాతృభాషలోనే ప్రాథమిక విద్య
విద్యా రంగంలో భారీ సంస్కరణల దిశగా మోదీ సర్కార్ అడుగు వేసింది. ప్రస్తుత పోకడలకు అనుగుణంగా నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ, నైపుణ్య విద్యను ప్రోత్సహించే విధంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యా శాఖగా పేరు మార్చింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భౌతిక దూరం ఎక్కడ?
భాగ్యనగరంలో కరోనా రెచ్చిపోతుంది. నిబంధనలు పాటించకుండా ఉన్న వారికి కరోనా తొందరగా సోకుతోంది. గతంలో ఓ సమావేశంలో మాస్కు ధరించని పద్మారావు గౌడ్‌కు కొవిడ్ అంటుకుంది. అయినా కూడా ప్రజాప్రతినిధుల సమావేశంలో నాయకులు భౌతిక దూరం పాటించకుండా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఉప్పల్ నల్లచెరువు వద్ద జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన నాయకులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మహిళ పోలీసులు జయించారు
భాగ్యనగరంలోని పోలీసు శాఖలో మహిళలు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. కరోనా బారిన పడి కోలుకుని విధుల్లో చేరిన 38 మంది మహిళా పోలీసులను ఆయన సత్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కాంగ్రెస్ కార్యాలయం కబ్జా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు.. అధికార పార్టీకి అమ్ముడుపోవడాన్ని ఏఐసీసీ జిల్లా కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఖండించారు. పార్టీ మారడంతో పాటు మణుగూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.