1. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు
1,100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... లక్షణాలున్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. కరోనా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఈటల ప్రారంభించారు. గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పాజిటివ్ శాతం తక్కువే
మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల్లో కరోనా పాజిటివ్ శాతం 27.3 శాతం నుంచి 10.18శాతానికి తగ్గిందని వెల్లడించింది. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని నివేదికలో ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆక్రమణదారులపై చర్యలు
ఆలయ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దశాబ్దాల నాటి లీజులను పున:సమీక్షించాలని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జంటనగరాల పరిధిలో దేవాలయ భూముల పరిరక్షణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ అధికారులతో సమావేశం జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అయోధ్యలో మసీదు
అయోధ్యలో 5 ఎకరాల్లో మసీదు నిర్మించేందుకు ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు జుఫర్ అహ్మద్ ఫరూఖీ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు నిర్మించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రఫేల్‌పై దాడికి యత్నం
ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ యుద్ద విమానాలు భారత్‌కు చేరుకునే ముందు మంగళవారం రాత్రి యూఏఈలోని అల్ దాఫ్రా విమానాశ్రయంలో దిగాయి. ఈ నేపథ్యంలో విమానాలు ఉన్న సమయంలో ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడి గురించి హెచ్చరించే వెల్లడించే సైరన్ మోగింది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.