1. రాష్ట్రంలో మరో 1,593 కరోనా కేసులు
రాష్ట్రంలో శనివారం 15,654 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... వారిలో 1,593 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 54,059కు చేరింది. ఇప్పటివరకు 3,53,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మూడు రోజుల్లో సచివాలయం నేలమట్టం
రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సచివాలయ భవనాలు నేలమట్టం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కూల్చివేత పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 'ఛలో మల్లారం' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కార్గిల్ స్ఫూర్తితో కరోనాపై పోరాడదాం
'కార్గిల్ విజయ్ దివస్' వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్పేయీ వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత భద్రతలో పీపీఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటి వల్ల ఉపయోగం ఎంత ఉందో.. వాడేసిన తర్వాత సరైన రీతిలో పడేయకపోతే అంతే నష్టం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం.. మూగ జీవాల పాలిట శాపంగా మారుతోంది. ఓసారి వాటి వివరాలు తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.