1. తెలంగాణ తల్లడిల్లుతోంది!
రాష్ట్రంలో.... కరోనా కేసుల సంఖ్య 22 వేలు దాటింది. శనివారం అత్యధికంగా 1,850 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు... వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మరో ఐదుగురి మృతితో మృతుల సంఖ్య 288కి చేరింది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. IAS అధికారుల కమిటీని ప్రభుత్వం రంగంలోకి దించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణ లాస్ట్!
తెలంగాణలో బుజ్జాయిలు తక్కువ మంది ఉన్నారట. నాలుగేళ్లలోపు బాలల జనాభాలో బిహార్ మొదటి స్థానంలో ఉంటే... తెలంగాణ చివరి స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సాగు"బడి"
కరోనా వైరస్ విస్తృతితో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో... చదువు ఎప్పుడు గాడిన పడుతుందో తెలియని పరిస్థితి. అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని... గ్రామీణ ప్రాంత విద్యార్థులు వ్యవసాయంపై మక్కువతో క్షేత్రాల్లోకి దిగి పొలం పనులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కొవిడ్‌కు చౌకైన పరికరం
కరోనా నిర్ధరణ పరీక్షల కోసం చౌకైన సెంట్రిప్యూజ్ను తయారుచేశారు భారత సంతతి శాస్త్రవేత్త మను ప్రకాశ్. పేద దేశాల్లో వైరస్ పరీక్షలను పెంచేందుకు ఇది వీలు కలిగిస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొత్త ఒరవడి
భారత్‌లో వ్యవసాయ పరిశోధన, విస్తరణ విద్య పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.