తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 4:57 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ వార్తలు @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN NEWS 5PM
టాప్​టెన్​ వార్తలు @ 5PM

1. కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన క్షేమంగా డిశ్చార్జయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. సవరణతో వినియోగదారులు, రైతులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ లేఖ రాశారని మంత్రి గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 440 కిలోల గంజాయి స్వాధీనం

ఖమ్మంలో పెద్ద ఎత్తున గంజాయిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్​ కాలనీలో ఓ ట్రాక్టర్​లో తరలింపునకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ.44 లక్షల విలువైన 440 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఎయిమ్స్ పరీక్షల్లో తెలుగు తేజం..

ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( ఎయిమ్స్) సూపర్ స్పెషాలిటీ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అవ్వారు ప్రతాప్ కుమార్ సత్తా చాట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఈ-విద్యలో 'ఫస్ట్​బెల్​' కొట్టిన కేరళ

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలు బంద్​ అయ్యాయి. మార్చి నుంచి విద్యార్థులు పుస్తకాల వంక చూడటమే మానేశారు. ప్రభుత్వాలు కూడా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఫలితాలను విడుదల చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'విస్తరణవాద శకం ముగిసింది- ఇది అభివృద్ధి యుగం'

లద్దాఖ్​లో ఆకస్మిక పర్యటన చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. చరిత్రలో విస్తరణవాద శక్తులు ఓడిపోవడమో.. తోకముడవడమో జరిగిందన్నారు. సరిహద్దులో సైన్యం ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. చైనా చొరబాట్లపై నిజం చెప్పండి

సరిహద్దులో చైనా చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ నిజాలు దాస్తున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ​ విమర్శించారు. అక్కడి భూభాగాన్ని లాక్కున్నారని స్థానికులు ఆరోపిస్తోన్న వీడియోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రాహుల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'ధోనీని అర్థం చేసుకునేందుకు ఆరేళ్లు పట్టింది'

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పిన బౌలర్ ఇషాంత్ శర్మ.. అతడిని అర్థం చేసుకునేందుకు తనకు ఆరేళ్ల సమయం పట్టిందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. వారాంతంలో లాభాలతో ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 177 పాయింట్ల వృద్ధితో 36,021 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. విద్యాబాలన్ 'శకుంతలా దేవి' ఈనెల చివర్లో..

గణిత శాస్త్రవేత్త, మానవ కంప్యూటర్​ 'శకుంతలా దేవి' బయోపిక్​.. ఈనెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ టైటిల్​ రోల్​ పోషించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details