1. 'ఈటీవీ బాలభారత్' ఛానళ్లను ప్రారంభించిన రామోజీరావు
చిన్నారుల వినోదానికి సరికొత్త వేదికను తీసుకువచ్చింది ఈటీవీ నెట్వర్క్. 'బాలభారత్' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. ఛానళ్లను మంగళవారం ఒకేసారి ప్రారంభించారు రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముగిసిన ప్రచారం.. 30న పోలింగ్
రాష్ట్రంలో మినీ పురపోరుకు సంబంధించి ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరిగా చేసిన ప్రచారానికి తెరపడింది. విమర్శలు, ప్రతివిమర్శలతో మారుమోగిన మైకులు బందయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆక్సిజన్ కొరత లేదన్న ఈటల
రాష్ట్రంలో అవసరమైన ఆక్సిజన్ కంటే ఎక్కువే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'కర్ఫ్యూ తర్వాత చర్యలు చెప్పండి'
కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 30న పురపోరు పోలింగ్‌కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో నివేదించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మాస్క్‌లను సరైన విధంగా పెట్టకపోయినా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ముగిసిన ఎమ్మెస్సార్ అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.