తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

By

Published : Apr 26, 2021, 8:57 PM IST

1. చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​

చిన్నారుల వినోదానికి సరికొత్త వేదికను తీసుకురానుంది ఈటీవీ నెట్​వర్క్​. 'బాలభారత్​' పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. 12 ఛానళ్లను ఒకేసారి ప్రారంభిస్తోంది. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్ని విభిన్నంగా ఆవిష్కరించనున్న బాలభారత్​.. ఈటీవీ ప్రస్థానంలో మరో కలికితురాయిగా నిలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఆ విద్యార్థులు ప్రమోట్‌

రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'అక్కడ బెల్టు షాపులపై చర్యలు'

మినీ పురపోరు సందర్భంగా మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఎస్ఈసీ... 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు వరకు మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'వేడుకలను ఘనంగా జరపలేకపోతున్నాం'

ఏప్రిల్​ 27న తెరాస 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండాను ఎగరవేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సూచించారు. ప్రతి ఇంటిపై గులాబీ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'మే 14-18 తేదీల్లో కరోనా ఉగ్రరూపం'

దేశంలో కరోనా 2.0 మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని ఐఐటీ నిపుణులు తెలిపారు. వచ్చే నెల మధ్య కాలంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 38-48 లక్షల గరిష్ఠానికి పెరగొచ్చని అంచనా వేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కర్ణాటకలో రెండు వారాల పాటు కర్ఫ్యూ

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఆ రంగాలకు మినహాయింపు'

లిక్విడ్ ఆక్సిజన్​​ వినియోగంలో మూడు రంగాలకు కేంద్ర ప్రభుత్వం సోమవారం మినహాయింపులు ఇచ్చింది. ఇకపై ఇంజక్షన్ సీసాల తయారీ​, ఫార్మా, రక్షణ​ రంగాల్లో లిక్విడ్​ ఆక్సిజన్​ను వినియోగించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. జపాన్ ప్రధానికి మోదీ ఫోన్

కొవిడ్​ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై జపాన్​ ప్రధాని యొషిహిదె సుగాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపైనా సంభాషించినట్టు ట్వీట్ చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. హాకీ కెప్టెన్​తో సహా ఏడుగురికి కరోనా

భారత మహిళల హాకీ జట్టులోని ఏడుగురితో పాటు మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని సాయ్​ అధికారికంగా ప్రకటించింది. బాధితుల్లో కెప్టెన్ రాణి రాంపాల్​, వీడియో అనలిస్ట్​ అమృత ప్రకాశ్​, సైంటిఫిక్​ అడ్వైజర్​ వేన్​ లాంబర్డ్​లు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కరోనాతో దర్శకుడు మృతి

తెలుగు సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కరోనాతో కన్నముశారు. గచ్చిబౌలిలోని టిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details