తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​@9PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news telugu, etv bharat top news
టాప్​ టెన్ న్యూస్​@9PM

By

Published : Mar 28, 2021, 9:00 PM IST

1. యాదాద్రిలో మరో 32 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో పనిచేసే 32 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. శనివారం 30 మంది ఉద్యోగులకు వైరస్​ సోకగా రెండు రోజుల్లో 62 మంది కొవిడ్​ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అగ్ని ప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం

ఓ ప్రాజెక్టు వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు కాస్తా చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. అక్కడ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరంలో డీజిల్​ కారణంగా అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ పార్టీలకు కాంగ్రెస్ లేఖలు

కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం లేఖలు రాసింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఘనంగా పెద్దాపూర్ మల్లన్న జాతర

జగిత్యాల జిల్లా పెద్దాపూర్​వాసులు ఆనవాయితీగా నిర్వహించుకునే మల్లన్న స్వామి జాతర అట్టహాసంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో మల్లన్నకు బోనాలు సమర్పించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తృణమూల్‌ నేత అరెస్టు!

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ నేత ఛత్రాధర్‌ మహతోను ఎన్​ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల కస్టడీకి తరలించారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఆయనను యూఏపీఏ కింద అరెస్టు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భక్తులకు సేవలపై ప్రతిజ్ఞ

హరిద్వార్​లో వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. భక్తులంతా సురక్షితంగా ఉండేలా పనిచేయనున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. హిరేన్‌ మృతి కేసులో మలుపు

ముకేశ్​ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్‌ సీపీయూ, వాహనం నంబర్‌ ప్లేట్​ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. భారత్, అమెరికా విన్యాసాలు

రక్షణ, సైనిక భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహా సముద్రంలో భారత్, అమెరికా నౌకాదళ విన్యాసాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'సిక్సర్ల' రికార్డు

పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో ఓ రికార్డు నమోదైంది. టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​ పూర్తయ్యేసరికి మొత్తంగా ఈ సిరీస్​లో ఇరు జట్లు కలిపి 63 సిక్స్​లు నమోదు చేశాయి. ఫలితంగా అత్యధిక సిక్స్​లు నమోదైన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​గా ఇది నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. గూఢచారిగా రాధికా-'వై' టీజర్​

బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే తన కొత్త సినిమాలో గూఢచారి పాత్ర పోషించనుంది. 'మిసెస్​ అండర్​కవర్'​ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీకాంత్‌, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ 'వై' టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details