1. పండుగలు, ర్యాలీలపై నిషేధం
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ర్యాలీలు, ఉత్సవాలపై కూడా ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా
యాదాద్రి ఆలయంలోని 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ను గెలిపించండి'
ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించాలని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కోరారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'టీకా తీసుకున్నా కరోనా వచ్చే అవకాశం'
టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 0.7 శాతం కరోనా టీకా వృథా అయిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తొలి దశలో 80% పోలింగ్
బంగాల్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 190 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.