1. 150-200 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లాలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొంది. గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్ల కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 150 నుంచి 200 మందికి గాయాలయ్యాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ప్రజలు ముందుకు రావడం లేదు'
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. పాఠశాలలు, వసతిగృహాల్లో ఇటీవల కరోనా కేసులు వెలుగులోకి వచ్చినందున అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కరోనా కేసులు బయట పడుతున్నప్పటికీ తీవ్రత, లక్షణాలు గతంలో మాదిరి లేవన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 30 శాతం ఫిట్‌మెంట్
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. 30 శాతం పీఆర్సీతో పాటు ఉద్యోగ పదవీ విరమణ పెంపును 61 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పాఠశాలల కొనసాగింపుపై తర్జన భర్జన
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల కొనసాగింపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. పాఠశాలల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'మహా'లో లేఖ రచ్చ!
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలతో ముంబయి మాజీ సీపీ రాసిన లేఖ దుమారం రేపుతోంది. వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని సీపీ పేర్కొన్న సమయంలో.. దేశ్‌ముఖ్ ఎక్కడ ఉన్నారనే అంశంపై పాలక విపక్షాలు మాటల దాడి చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.