1. 26న రైతుల 'భారత్ బంద్'
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా ఆ రోజున భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. విశాఖ ఉద్యమానికి మద్దతు: కేటీఆర్
విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. శివరాత్రికి సిద్ధం
మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు.. పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భర్తను హత్య చేసి ఫిర్యాదు
భార్యే భర్తను హతమార్చి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. పైగా ఏం ఎరగనట్టు భర్త అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా...అసలు విషయం బయటపడింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.