1. పింక్ టెస్టు భారత్‌దే
మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. శివకాశీలో ఐదుగురు మృతి
తమిళనాడు శివకాశీలోని బాణసంచా తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్
ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా శాఖల వారీ భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను కేటీఆర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'త్వరగా సీరం సర్వే చేయించండి'
వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాష్ట్రానికి మరోసారి అవార్డులు
తెలంగాణకు మరోసారి స్కోచ్ అవార్డులు లభించాయి. స్కోచ్ ఇ-గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. 2020కి గాను స్కోచ్ ఉత్తమ మంత్రి అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.