1. రాష్ట్ర వ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్
దాదాపు పది నెలల కాలంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి విరుడుగు ఇచ్చే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 139 ప్రభుత్వ ఆస్పత్రులో వాక్సినేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'మొదటి డోసు నేనూ తీసుకుంటా'
రేపు రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాను టీకా తీసుకుంటానని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'కేంద్రం సిద్ధంగా ఉంది'
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్‌ను కోరినట్లు పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అఖిల ఫోన్లు ఎక్కడున్నాయి?
ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 19న మరోసారి భేటీ!
కేంద్రం, రైతుల మధ్య జరిగిన 9వ విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు మరోసారి డిమాండ్ చేశాయి. అయితే.. చర్చల ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.