1. భారత్ బయోటెక్‌కు లైసెన్స్
భారత్ బయోటెక్ సంస్థకు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి ఇచ్చింది. కొవాగ్జిన్ టీకా తయారీ కోసం భారత్ బయోటెక్‌కు లైసెన్సింగ్ అనుమతి మంజూరైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'అన్నిదేశాలకు అందిస్తాం'
వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించినట్లు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భారత్ సిద్ధం
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను భారత్‌లో అత్యవసరంగా వినియోగించేందుకు డీసీజీఐ పచ్చ జెండా ఊపింది. ఈ టీకాలు భద్రం, సురక్షితమని తెలిపింది. రెండు స్వదేశీ టీకాలకు అనుమతి లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది కీలక ముందడుగు అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రోజూ 10 లక్షల మందికి
కరోనా వ్యాక్సిన్ తయారీతో తెలంగాణ కీర్తి.. పతాక స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా చందూరు మండలం ఘనపూర్ వద్ద దారుణం జరిగింది. ఉమ్నాపూర్‌కు చెందిన సుజాత(30), ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. 3 రోజుల క్రితం సుజాత, ఆమె బాబును రాము అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. చర్చలకు కేంద్రం సిద్ధం
కేంద్రం, రైతు సంఘాల మధ్య సోమవారం ఏడో విడత చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో కొత్త సాగు చట్టాల రద్దుపై ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలా జరగకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పైకప్పు 23 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరైన సమయంలో శ్మశానవాటిక ప్రాంగణ పైకప్పు కూలి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 3.5 లక్షలు దాటిన కేసులు
కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 3లక్షల 50వేలు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. థాయ్‌లాండ్‌కు భారత బృందం
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బయల్దేరారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు. సైనా, సాయి ప్రణీత్, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు థాయ్‌లాండ్ వెళ్లారు. సింధు నేరుగా లండన్ నుంచి బ్యాంకాక్ పయనం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'ధూమ్ 4'లో స్టార్ హీరోయిన్!
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రం 'ధూమ్'. ఈ ఫ్రాంచైజీలో మరో చిత్రం రానున్న నేపథ్యంలో విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.