1. 90 నామినేషన్లు తిరస్కరణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తైంది. 90 నామినేషన్లు ఆర్వోలు తిరస్కరించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మేం ఎంతో చేశాం: కేటీఆర్
ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్కపనైనా చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రోడ్‌షోల ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన కేటీఆర్... తెరాస సర్కార్ పాలనలో భాగ్యనగర అభివృద్ధికి ఎంతో చేశామని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ఆలస్యం
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అగ్నిప్రమాదం.. 2 కోట్ల నష్టం
సూర్యాపేట జిల్లాలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 2 వేల 800 క్వింటాల పత్తి దగ్ధమైంది. దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాటన్ మిల్లు యాజమాన్యం అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తెరాస హామీలపై రేపు ఛార్జ్‌షీట్ విడుదల : కిషన్ రెడ్డి
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు ఉదయం తెరాస హామీలపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఛార్జ్‌షీట్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విడుదల చేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.