1. ఆర్థిక నష్టం, ఆలయ పనులపై రేపు సీఎం సమీక్ష
కొవిడ్ మహామ్మారి వల్ల తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, అధికారులు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'అతిపెద్ద ఎఫ్‌డీఐ'
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను... సుమారు 20,761 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో నిర్మించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్
హైదరాబాద్ వరద సహాయంలో భారీ కుంభకోణం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడిన ఉత్తమ్.. జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పవార్‌ని కలిసిన మంత్రి
మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను రైతులు ఆద్యుడిగా భావిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల సహకార వ్యవస్థ, సహకార పరిశ్రమలు, వ్యవసాయ విద్య, కృషి విజ్ఞాన కేంద్రాలు లాంటివి పవార్ కృషికి నిదర్శనమని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్ బరి: సర్వం సిద్ధం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మూడోదశలో 78 స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.34 కోట్ల మంది ఓటర్లు.. 1204 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.