తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9AM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9AM

By

Published : Nov 26, 2020, 8:57 AM IST

1. తీవ్ర తుపానుగా మారిన నివర్

బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటింది. తుపాను ప్రమాదం ఇంకా తొలగలేదని వాతావారణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఎన్నికల వాయిదాకు ఎత్తుగడ: కేసీఆర్​

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జనహితం తమకు ముఖ్యం: కేటీఆర్​

హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు రాని కేంద్రమంత్రులు.. జీహెచ్​ఎంసీ ఎన్నికలనగానే వరదలా వస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నగరానికి వచ్చేటప్పుడు వరదసాయం రూ. 1350 కోట్లు పట్టుకురావాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నేడు భాజపా మేనిఫెస్టో విడుదల

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో భాజపా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెరాస, మజ్లిస్ పార్టీలపై కమలం నేతలు మాటల తూటాలు సంధిస్తున్నారు. ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాష్ట్రానికి రానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తొలి విడత 70-75 లక్షల మందికి టీకా

కొవిడ్‌ టీకాలను తొలి విడతలో దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుమారు 70-75 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందవచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. టీకా ఇచ్చే ప్రతి వ్యక్తికి 2 డోసుల చొప్పున 4 వారాల వ్యవధిలో అందజేస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 71 ఏళ్లయ్యాయి. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు వందన సమర్పణ చేస్తూ- రాజ్యాంగ సూత్రాలకు, విలువలకు బద్ధులమై నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా దేశం పట్ల మన విధులను, బాధ్యతలను నెరవేర్చాలి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'డిసెంబర్​ చివరి నాటికి వ్యాక్సిన్​!'

దేశ ప్రజలకు డిసెంబర్​ చివరి నాటికి కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. టీకా అభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని, పలు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రూ.15 లక్షల కోట్ల మేర ముప్పు!

వచ్చే పదేళ్ల కాలంలో దేశ జీడీపీకి భారీ ముప్పు వాటిల్లనుందని మెకిన్సే గ్లోబల్​ నివేదికలో వెల్లడైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా బయట పనిచేసే కార్మికుల పనిగంటలు తగ్గడం వల్ల సుమారు 200 బిలియన్​ డాలర్ల నష్టం జరగనుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. జెర్సీ మార్పు వెనుక కారణం!

ఆస్ట్రేలియా పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్​లో టీమ్​ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలను ధరించనున్నారు. 1992 ప్రపంచకప్​ నాటి జెర్సీలను పోలిన వాటితో భారత ఆటగాళ్లు ధావన్​, కేఎల్​ రాహుల్​ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సన్​ ఆఫ్​ ఇండియా' రెండో షెడ్యూల్

విలక్షణ నటుడు మోహన్​ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సన్​ ఆఫ్​ ఇండియా'. దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details