తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @9AM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9AM NEWS
టాప్‌టెన్‌ న్యూస్ @9AM

By

Published : Nov 9, 2020, 8:57 AM IST

1. ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న టిప్పర్‌ వారి పాలిట మృత్యుపాశంగా మారింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టగా నలుగురు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. తెలుగు జవాన్ల వీరమరణం

జమ్మూకశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వారితో పాటు ఓ సైనికాధికారి, బీఎస్​ఎఫ్​ జవాన్​ సైతం ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వేగంగా కరోనా వైరస్​ వ్యాప్తి

అసలే కొవిడ్‌ ఉద్ధృతి.. అందులోనూ చలికాలం.. దీనికితోడు దీపావళి వేళ టపాకాయల కాలుష్యం.. మామూలుగానే అతి వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న కరోనా వైరస్‌.. ఈ సమయంలో సాధారణం కంటే మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రెండో స్థానంలో హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో దిల్లీ నిలువగా.. రెండో స్థానంలో హైదరాబాద్ మెట్రో రైలు నిలించింది. లాక్ డౌన్ తర్వాత ప్రయాణికులు అంతగా మొగ్గు చూపకపోయినా.. కొద్దిరోజులుగా జంటనగరాల్లో మెట్రోను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్‌ బరి: లెక్కింపునకు సిద్ధం

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం(ఈసీ). రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'సంబంధాలు బలపడాలి'

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌, కమలా హారిస్‌ ద్వయానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారికి లేఖలు రాసిన సోనియా.. భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు బలోపేతమవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్​ ముందున్న సవాళ్లు

పిన్న వయస్కుడైన సెనేటర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించి 48 ఏళ్ల తరవాత అత్యంత వయోధిక అధ్యక్షుడిగా కొలువు తీరనున్న బైడెన్‌.. తక్షణ ప్రాథమ్యాలుగా కొవిడ్‌ సంక్షోభంతోపాటు ఆర్థిక మాంద్యమూ నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. దోచుకున్న ఎన్నికలు: ట్రంప్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై డొనాల్డ్​ ట్రంప్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని తన నుంచి 'దోచుకున్న' ఎన్నికలు​గా అభివర్ణించారు. అయితే ట్రంప్​ ఆరోపణలను బైడెన్​ వర్గాలు తోసిపుచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రన్నరప్​గా​ రామ్​కుమార్​

భారత టెన్నిస్​ ప్లేయర్​ రామ్​కుమార్​ రామనాథన్​.. ప్రతిష్ఠాత్మక ఎకెన్​టాల్​ ఛాలెంజర్​ టోర్నీ ఫైనల్లో ఓడిపోయాడు. కేవలం రన్నరప్​ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'నట్​ఖట్'​కు అరుదైన గౌరవం

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన లఘుచిత్రం 'నట్​ఖట్'​.. ఈ ఏడాదికి గానూ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల పరిశీలనకు నేరుగా అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details