1. కొత్తగా 1,421 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,421 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో కొవిడ్ బాధితుల సంఖ్య 2,29,001కు చేరింది. ఇప్పటివరకు 1,298 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!
మరో రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసుల ఆర్టీసీ చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్షా 60వేల కిలోమీటర్లకు రూట్‌మ్యాప్‌ను తయారు చేసి తెలంగాణ ఆర్టీసీ అధికారులకు ఏపీ అధికారులు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నష్టం రూ.9,422 కోట్లు
రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన రెండో రోజూ కొనసాగనుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు కొన్ని జిల్లాల్లోనూ అధికారులు పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యాక నష్టంపై అధికారుల బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ధరణి సాగేనా సాఫీగా..?
రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం చర్యలు ముమ్మరమయ్యాయి. దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభంకానున్న అంచనాల నడుమ... నమూనా లావాదేవీలు చేపడుతున్నారు. నేటి నుంచి డిజిటల్ సంతకాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొవాగ్జిన్ మూడో దశకు లైన్ క్లియర్
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్ టీకా' 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. త్వరలోనే ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరీక్షల ఫలితాల ఆధారంగా మూడోదశకు అనుమతిని ఇచ్చిందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.