తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @7PM

By

Published : Apr 27, 2021, 6:58 PM IST

1. ముగిసిన పుర ప్రచారం

రాష్ట్రంలో మినీ పురపోరుకు సంబంధించి ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరిగా చేసిన ప్రచారానికి తెరపడింది. విమర్శలు, ప్రతివిమర్శలతో మారుమోగిన మైకులు బందయ్యాయి. ఎండను, కరోనా వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా పార్టీ నేతలు ప్రచారం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ఏం చేశారో చెప్పండి'

కరోనా చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదిక సరిగా లేదన్న ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై ఆందోళన వెలిబుచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆక్సిజన్‌ కొరత లేదు...

రాష్ట్రంలో అవసరమైన ఆక్సిజన్‌ కంటే ఎక్కువే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. నిబంధనల మేరకే ప్రైవేటు ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలని మరోసారి హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆ పోలీసులకు ప్రత్యేక పార్క్

కొవిడ్ మ‌హ‌మ్మారి బీభ‌త్సం సృష్టిస్తోంది. జిల్లాలో.. సాధార‌ణ జ‌నంతో పాటు ప్రాణాలు అడ్డుపెట్టి విధులు నిర్వహిస్తూ క‌రోనా బారిన‌ పడుతోన్న పోలీసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే.. ఓ వినూత్న ఆలోచన చేశారు బోథ్ పోలీసులు. బాధితులు.. వ్యాయామం చేసుకునేందుకు వీలుగా వారి కోసం ఓ ప్రత్యేక పార్క్​ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మిమిక్రీలో రికార్డ్..

తమిళనాడులోని కోయంబత్తూర్​లో ఓ యువకుడు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. కేవలం ఆరు నిమిషాల్లో 128 మంది స్వరాలను మిమిక్రీ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఒకే అంబులెన్సులో 22 మృతదేహాలు..

కరోనాతో చనిపోయిన 22 మంది శవాలను ఒకే అంబులెన్సులో తరలించారు అధికారులు. ఆస్పత్రిలో తగినన్ని అంబులెన్సులు అందుబాటులో లేనందున.. కరోనా రోగులను తరలించే వాహనంలోనే శవాలను శ్మశానాలకు చేరవేస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సైన్యం సాయం అవసరం...

కరోనా కట్టడి కోసం పౌర యంత్రాంగానికి సైనిక దళాలు సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అడ్డంకులను ఎదిరించి అంకితభావంతో పనిచేసేందుకు సాయుధ దళ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఏడుగురు మృతి...

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. హాకీ అంపైర్స్​ మేనేజర్​ మృతి...

హాకీ ఇండియా అంపైర్స్​ మేనేజర్​ వీరేంద్ర సింగ్ కరోనా సంబంధిత సమస్యలతో మరణించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించింది హాకీ ఇండియా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కార్తికేయ తొలి చిత్రం విడుదల...

కార్తికేయ నటించిన మొదటి చిత్రం 'ఫైనల్ సెటిల్​మెంట్' అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు రిలీజ్​కు నోచుకోలేదు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details