1. సీఎంకు ధన్యవాదాలు
రాష్ట్రంలో ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్, 61 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసు సహా పలు హామీలు ఇచ్చిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ప్రతిపక్షాన్ని బతకనివ్వండి'
ప్రభుత్వంపై భాజపా ఒత్తిడి, నిరసనలు చేయడంతోనే ఉద్యోగులకు కేసీఆర్ పీఆర్సీని ప్రకటించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఇష్టం లేకున్నా.. కష్టం కొద్ది పీఆర్సీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌కేసులో నిందితులు అఖిల ప్రియ సోదరుడు, భర్త పోలీసులకు లొంగిపోయారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి... బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఆ నిందితున్ని వెంటనే శిక్షించాలి'
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస నాయకుడు అసిఫ్‌ను తక్షణమే శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని కామారెడ్డి ఏబీవీపీ కన్వీనర్ మనోజ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పార్లమెంటులో రగడ
మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ లేఖ వివాదం.. పార్లమెంటుకు చేరింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్, భాజపా, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా మధ్య మాటల యుద్ధం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.