1. 'సభలో తీర్మానం చేయాలి'
సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 30 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరినా.. కొవిడ్ పేరు చెప్పి కుదిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రూ.8 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 140 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ఈనాడు ప్రాపర్టీ షో'
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న ‘ఈనాడు ప్రాపర్టీ షో’ మరలా మీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికి ౩౦ ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించిన ‘ఈనాడు ప్రాపర్టీ షో’ తన 31వ ఎడిషన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏప్రిల్ 3, 4వ తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్లోనే అతి పెద్ద ప్రాపర్టీ షోగా నిలవనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'విచారణ అవసరం లేదు'
సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ ఎన్కౌంటర్ కేసులో ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్ ఎన్కౌంటర్' కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.