1. రేపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
75వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం 11 గం.కు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఆ నాలుగు రోజులు నో వైన్స్
ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వాటిని మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వారి వాహనంలో ప్రయాణిస్తే కేసు
తాగి వాహనాలు నడిపే వారితో పాటు డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి.. వాహనం ఎక్కిన వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. కోరమీసాల మల్లన్నను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'మహా'లో కరోనా విజృంభణ'
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించటంపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరిస్థితులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.