1.నియంత్రిత సాగు ఉండదు
రాష్ట్రంలోని రైతులందరికి రేపటి నుంచి రైతుబంధు పథకం కింద ఆర్థిక సాాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రక్షకుడుగా భాగ్యనగరం
2020.. ఈ సంవత్సరం పేరు వింటే చాలు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్- 19 పేరు గుర్తుకొస్తుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ మహానగరంలో 5 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మలుపుతిప్పిన 2020
రాష్ట్ర రాజకీయం 2020లో మలుపు తిరిగింది. సంవత్సరం పొడవునా.. తెరాస ఆధిపత్యం కొనసాగినా ఏడాది చివర్లో మాత్రం భాజపా అనూహ్యంగా పుంజుకుంది. పురపోరు, సహకార ఎన్నికల్లో కారు పార్టీకి ఎలాంటి సవాల్ ఎదురుకాకపోయినా దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ సంచలన ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 25 మందికి అస్వస్థత
నాటుసారా తాగి 25 మంది అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సిరిమామిడిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 23 మంది కోలుకోవటంతో ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ లేఖకు మోదీ స్పందన
తమ గ్రామ సమస్యపై ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసిందా చిన్నారి. ఇలా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే చిన్నారి లేఖకు ప్రధాని కార్యాలయం స్పందించింది. వివరణ ఇవ్వాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.